నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

-

‘మిలాద్ ఉన్ నబి’ సందర్భంగా నేడు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ అంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలో పలు  ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దీంతో నగరవాసులు ఈ అంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యమ్నాయ మార్గాల ప్రయాణించాలని  సీపీ మహేష్ భగవత్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు కోసం డయల్ 100కు సమాచారం ఇవ్వొచ్చని సీపీ తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు గల ప్రాంతాలు…
ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – సరూర్‌నగర్ ట్యాంక్ ఇద్గా, ఎల్బీనగర్ మజీద్ గల్లీ, దుర్గామాతా టెంపుల్ గల్లీ, ఎన్టీఆర్ నగర్ మార్కెట్ మసీదు.
వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – పహాడిషరీఫ్ మార్కాజ్ దర్గా, మార్కాజ్ దర్గా ఉస్పానా మందిర్, సాదత్‌నగగర్, నందనవనం కాలనీ, సాహేబ్‌నగర్ జామా మసీదు, బడి మసీదు, హయత్‌నగర్.
మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – మౌలాలీ కమాన్ మసీదు, ఎస్పీనగర్ మసీదు, మల్కాజిగిరి మసీదు, సాకేత్ సాయిబాబానగర్ ఈద్గా.
కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – ఘట్‌కేసర్ మసీదు

మిలాద్ ఉన్ నబి సందర్భంగా ఊరేగింపుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news