అనురాగ్ పై కేసు.. రాష్ట్రపతికి లేఖ రాసిన పాయల్ ఘోష్..

-

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఒకానొక సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి అనురాగ్ కశ్యప్, తనని లైంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై అనురాగ్, పాయల్ వ్యాఖ్యలని ఖండించాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు అనురాగ్ కి అండగా నిలుస్తూ, అనురాగ్ కశ్యప్ అలాంటి వారు కాదని, మహిళలకి చాలా గౌరవం ఇచ్చే వాళ్ళలో అతను ముందుంటాడని చెప్పారు.

ఐతే ఈ విషయంలో పాయల్ ఘోష్, ముంబై పోలీసులకి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ కేసు గురించి రాష్ట్రపతికి తెలియజేస్తూ లేఖ రాసింది. పేరున్న దర్శకుడిపై ఆరోపణలు చేసినందుకు కేసు అస్సలు ముందుకు కదలడం లేదని, అందువల్ల తనకు న్యాయం చేయాలంటూ, తనని లైంగికంగా వేధించిన వారికి శిక్ష పడేలా చేయమని చెప్తూ రాష్ట్రపతి భవన్ కి లేఖ రాసింది. దీన్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news