అస్సాం బిజెపి నేత సత్య రంజన్ బోరా కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. గువహతిలోని స్టేట్ జూ వెలుపల ఆయన ఒక నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన డిమాండ్ తెలిసి జూ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. జంతువులకు గొడ్డు మాంసం సరఫరా చేయవద్దు అని డిమాండ్ చేసారు. 30 మందితో పాటు ఆయన… గొడ్డు మాంసం తీసుకెళ్తున్న వ్యాన్ కూడా జూ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారు.
జంతువులకు గొడ్డు మాంసం సరఫరాను జూ అధికారులు, అస్సాం ప్రభుత్వం ఆపకపోతే, వారు “పరిణామాలను ఎదుర్కొనేందుకు” సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. జంతువులకు ఇవ్వవలసిన ఆహారంపై నిర్ణయం తీసుకునే సెంట్రల్ జూ అథారిటీ (సిజడ్ఎ) కు తమ డిమాండ్లను పంపాలని జూ అధికారులు నిరసనకారులను కోరారు. జంతువుల అవసరాలు మరియు ఆహారపు అలవాట్ల ప్రకారం ఆహారం ఇస్తారని, అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జూ అధికారులు పేర్కొన్నారు.