మంచు పెళ్లి కూతురును చూశారా ఎప్పుడైనా?

-

Stunning Snow Woman Bride Is Breaking The Internet

మంచు పెళ్లి కూతురేంది.. అని నోరెళ్లబెట్టకండి. మంచుతో ఓ బొమ్మను తయారు చేసి దానికి పెళ్లి కూతురు గెటప్ వేశారు. దానికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు పైన చూస్తున్నారు కదా ఆమె పెళ్లి కూతురు ఎలా ఉంది.. బాగుంది కదా. ఇంతకీ ఈ మంచు పెళ్లి కూతురు స్టోరీ ఏంటంటారా? పదండి తెలుసుకుందాం.

కెనడాలోని బ్రాంప్టన్‌కు చెందిన ఓ మహిళ ఈ మంచు పెళ్లి కూతురును తయారు చేసింది. సరదాగా తయారు చేసిన ఈ మంచు పెళ్లి కూతురును క్లిక్‌మనిపించి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది ఆ మహిళ. అంతే.. నెటిజన్లు ఊరుకుంటారా? నెటిజన్లకు ఆ మంచు పెళ్లి కూతురు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అదే సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. వావ్.. ఎంత ముద్దొస్తుందీ పెళ్లి కూతురు. నిజమైన పెళ్లి కూతురు కూడా పనికిరాదుపో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమందైతే.. దీపికా పదుకొనె కన్నా అందంగా ఉంది ఈ పెళ్లి కూతురు అంటూ కామెంటుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news