ఆడపిల్ల పుట్టిందని మట్టిలో పూడ్చేశారు..!

-

Girlchild was buried in Karnataka

అది కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న శిర అనే ఊరు. ఆ ఊరుకు దగ్గర్లోని చెరువు సమీపంలో ఓ మహిళ శిశువు ఏడుపును విన్నది. వెంటనే అటూ ఇటూ వెతికింది. అక్కడే మట్టిలో పూడ్చిన ఓ శిశువు కనిపించింది. తల మాత్రం బయట ఉంది. మిగితా శరీరం అంతా మట్టితో పూడ్చి ఉంది. అప్పుడే పుట్టిన శిశువులా ఉంది.. గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆ శిశువును చూశాక.. ఆ మహిళకు కాళ్లూ చేతులు ఆడలేదు. దీంతో వెంటనే ఊళ్లోకి పరిగెత్తుకెళ్లి అందరికీ ఈ విషయం చెప్పింది. వెంటనే గ్రామస్తులంతా అక్కడికి వెళ్లి ఆ శిశువును మట్టిలోనుంచి బయటికి తీసి… శిశువుకు స్నానం చేయించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువును ట్రీట్ మెంట్ చేసిన అనంతరం.. ఆ శిశువును తీసుకెళ్లి శిశు సంక్షేమ అధికారికి అప్పగించారు. ఆ అధికారి… శిశువును జాగ్రత్తగా చెప్పడంతో ఇక శిశువు బాధ్యతను ఆ అధికారికి అప్పగించారు గ్రామస్తులు. అయితే.. ఆ అమ్మాయి ఎవరికి పుట్టిందో.. ఎందుకు ఇక్కడ పడేశారో… బహుశా ఆడపిల్ల పుట్టిందని.. ఇలా ఇక్కడ వదిలేసి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ ఘటన చుట్టు పక్కన గ్రామాలకూ తెలియడంతో ఆ శిశువును చూడటానికి ప్రజలు తండోపతండాలుగా కదిలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news