గ్రేటర్‌లో వరదలపై కేసీఆర్‌ ఫోకస్‌..సాయంత్రం మంత్రులు,అధికారులతో సమీక్ష.

-

హైదరాబాద్‌లో భారీ వర్షాలు సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు..గ్రేటర్‌లో ఒక్కోరోజే 32 సెంమీ వర్షం కురిసి నగరాన్ని జల దిగ్భంధం చేసింది..అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదలపై సాయంత్రం సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు..మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది..వరద సహయక చర్యలు, కేంద్రానికి ఇవ్వాల్సిన నివేదికపై ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు..ఇప్పటి వరకూ జరిగిన వరద నష్టాన్ని అంచనవేసుకొని రావాలని అధికారులకు ఇప్పటికే సీఎం అదేశాలు జారీ చేశారు..ఈ సమావేశానికి సంబంధిత ఉన్నతాధికారులు, హైదరాబాద్‌ పరిధిలోని మంత్రులను కేసీఆర్‌ ఆహ్వానించారు..ఆయా శాఖలలో జరిగిన నష్టాన్ని అంచన చేసి వివరాలు తీసుకురావాలని కేసీఆర్‌ అదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news