నానికి షాక్ ఇచ్చిన నిర్మాతలు…!

-

నానికి షాకుల మీద షాకులు కొడుతున్నాయి. ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న నానికి ఇప్పుడు నిర్మాతల నుంచి కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నేచురల్‌ స్టార్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా అనౌన్స్‌అయిన “శ్యామ్‌ సింగారాయ్‌’కి బ్రేకులు పడుతున్నాయి. ఈ మూవీ నుంచి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకుంటోంది.

నాని బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులతో కొంచెం స్లో ఫేజ్‌లో ఉన్నాడు. “గ్యాంగ్‌ లీడర్‌, వి’ రిజల్ట్స్‌తో నాని గ్రాఫ్‌ కూడా పడిపోయింది. ఈ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు “శ్యామ్‌ సింగారాయ్‌’ నుంచి సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ నాగవంశీ తప్పుకుంటున్నాడు. ట్రేడ్‌ మార్కెట్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే ఒపీనియన్ ఉంది. అలాంటి బ్యానర్‌ ‘శ్యామ్‌ సింగారాయ్‌’ని పక్కనపెట్టెయ్యడం నానికి ఇబ్బందే అంటోంది ఇండస్ట్రీ. అయితే ఇంతకుముందు సితారాలో “జెర్సీ’ సినిమా చేశాడు నాని. ఆ రిలేషన్‌తోనే ఈ “సింగారాయ్’ అనౌన్స్ అయ్యింది. మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో ఈ సినిమా చేతులు మారుతోంది.

నాని వల్లే “శ్యామ్‌ సింగారాయ్‌’ నుంచి నిర్మాతలు తప్పుకున్నారా, లేక మరేదైనా కారణమా అన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు వెంకట్‌ బోయినపల్లి హ్యాండోవర్‌ చేసుకున్నాడనే టాక్ వస్తోంది. మరి కరోనా కాలంలో చేతులు మారిన ఈ ప్రాజెక్ట్‌కి కొత్త నిర్మాతలు పాత బడ్జెట్‌ ఇస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news