మైనింగ్ కింక్ గాలి జనార్ధన్ గనుల్లో అధికారులు రి సర్వే చేపట్టారు..ఆంధ్ర-కర్నాటక సరిహద్దులోని ఓబులపురం మైనింగ్‌లో సరిహద్దులను చేరిపి వేశారనే ఆరోపణలతో సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మళ్ళీ సర్వేను చేపట్టారు..100 ఏళ్ల నాటి గెజిట్లు, భూపటాలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆంధ్ర-కర్ణాటకలో సరిహద్దులను చెరిపేసి, అడవులు, ఆలయాలు కూడా మైనింగ్ సంస్థ తవ్వేసిందని..దీంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం సుప్రీంకోర్టు చేరడంతో..సర్వేఆఫ్ ఇండియా చెప్పింది రెండు రాష్ట్రాలు వినాలని న్యాయస్థానం అదేశించింది..దీంతో రంగంలోకి దిగిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు..ఆక్రమ మైనింగ్ చేసినట్లు గుర్తించిన ప్రాంతంలో అనతంపురం జేసీ నిశాంత్ కుమార్, బళ్లారి కలెక్టర్ పర్యవేక్షణలో ఈ సర్వే నిర్వహించనున్నారు..సర్వే అనంతరం రేపు రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 110 చోట్లు హద్దు పిల్లర్లను ఏర్పాటు చేయనున్నారు.