అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తెలుగు భాషకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పెద్దన్న ఎన్నికల్లో మన తెలుగు భాషలో నియమ నిబంధనలను ప్రచురించారు. “ అధికారిక బ్యాలెట్, ఎన్నికల రాత్రి 8 గంటలకు మీ బ్యాలెట్ ను జమ చేయండి. డ్రాప్ బాక్స్ లో బ్యాలెట్ ను జమ చేసేటప్పుడు తపాలా అవసరం లేదు. డ్రాప్ బాక్స్ లో ట్యాంపరింగ్ చేయడం ఎన్నికల కోడ్ 18500 ప్రకారం చట్ట విరుద్దం.
డ్రాప్ బాక్స్ నిండినా పని చేయకపోయినా లేదా ఏదైనా సందర్భంలో ఇబ్బంది వచ్చినా దయచేసి ఓటర్ల కార్యాలయ రిజిస్టార్ కు తెలియజేయండి, సంతకం చేసి ముద్ర వేయండి…” అంటూ పలు నియమ నిబంధనలను ఇంగ్లీష్, చైనీస్ సహా అనేక భాషల్లో ప్రచురించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ బ్యాలెట్ బాక్స్ సూచనలు దర్శనం ఇచ్చాయి. ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.