ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో భాగంగా మ్యాచ్‌లను ఆడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు కాసింత విరామం లభించింది. దీంతో ఆటగాళ్లు కొంత సేపు స్విమ్మింగ్ పూల్‌లో సేదదీరారు. ఈ క్రమంలోనే కోహ్లితోపాటు దుబాయ్‌లో ఉన్న అనుష్క శర్మ అతనితో కలిసి కాసేపు పూల్‌లో గడిపింది. అయితే అదే సమయంలో వారిద్దరికీ చెందిన ఓ రొమాంటిక్ పిక్‌ను బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ కెమెరాలో బంధించాడు. ఆ ఫొటో చాలా అద్భుతంగా రావడం విశేషం.
తమ ఫొటోను తీసినందుకు గాను కోహ్లి.. డివిలియర్స్‌కు క్రెడిట్స్ ఇచ్చాడు. దాన్ని కోహ్లి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కోహ్లి, అనుష్క శర్మలకు చెందిన ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. అంత అద్భుతంగా డివిలియర్స్ ఫొటో తీసినందుకు అతన్ని ప్రశంసిస్తున్నారు. ఏబీ డివిలియర్స్ సిక్స్‌లు బాదడంలోనే కాదు, ఫొటోలను తీయడంలోనూ ఎక్స్‌పర్ట్ అని కొనియాడుతున్నారు.
❤️🌅 pic credit – @ABdeVilliers17 pic.twitter.com/YhCqV9qGlE
— Virat Kohli (@imVkohli) October 18, 2020
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 6 మ్యాచ్‌లలో గెలిచింది. ఈ నెల 21న బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాతో అబుధాబిలో తలపడనుంది.