ఐపీఎల్‌లో మరో కీ ఫైట్ కాసేపట్లో జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌ల్లో ఉన్న రాజస్థాన్, చెన్నై అమీతుమీ తేల్చుకోనున్నాయ్. ప్లే ఆఫ్ రేస్‌లో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ సీజన్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ దే పై చేయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది ధోనీసేన.
ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ మొదలైంది. దీంతో ఇక నుంచి ప్రతి టీమ్‌కి ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ లీగ్‌లో మూడు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై ఈ సీజన్‌లో దారుణంగా ఆడుతోంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు ఓడిపోయి.. పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాల కోసం నానా తంటాలు పడుతోంది. బ్యాటింగ్‌లో మెరుపులేమీ కన్పించడం లేదు. షేన్ వాట్సన్, డుప్లెసిస్ తప్ప బ్యాటింగ్‌లో రాణించే వారే కరువయ్యారు.దీపక్ చాహర్, సామ్ కర్రన్, శార్దూల్ ఠాకూర్‌లతో పేస్ బౌలింగ్ బలంగా ఉంది.
మరోవైపు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ బాగా ఆడారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయారు. స్టోక్స్, బట్లర్ ఫర్వాలేదనిపిస్తున్నా.. ఇక పూర్తిగా టచ్‌లోకి రాలేదు. అయితే, మిగతా ఆటగాళ్లు మాత్రం అంతగా రాణించడం లేదు. రాజస్థాన్ మిడిలార్డర్ చాలా వీక్‌గా ఉంది. మిడిలార్డర్ వైఫల్యం వల్లే రాజస్ధాన్ తడబడుతోంది. రాహుల్ తేవటియా సూపర్ ఇన్నింగ్స్‌లతోనే రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.