హైదరాబాద్ ని డ్రగ్స్ రచ్చ మాత్రం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేగింది. ఎన్ని డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినా కొత్త గ్యాంగ్స్ తెరపైకి వస్తూ సరికొత్త తరహాలో డ్రగ్స్ సరఫరా చేస్తుండడం పోలీసులకి సవాల్ గా మారింది. నిజానికి జూన్ జూలై నెలల్లో హైదరాబాద్లో రెండు భారీ డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు.
తాజాగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిటీ యూత్ ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా నుండి స్టూడెంట్ విసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డానియల్ అనే నైజీరియన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. లంగర్ హౌజ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడి నుండి 6 గ్రాముల కో కై న్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.