కరోనా కట్టడిలో దక్షినాది టాప్…!

కరోనా కట్టడిలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయా…? అంటే అవుననే అంటున్నాయి లెక్కలు. కరోనా కట్టడిలో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు కూడా సమర్ధవంతంగా పని చేసారు అని కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ & తమిళనాడు వంటి 5 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా తగ్గింది అని చెప్పింది.

అంతే కాదు యాక్టివ్ కేసులు కూడా చాలా వరకు ఈ రాష్ట్రాల్లో తగ్గాయి అని కేంద్రం ప్రకటన చేసింది. భారత్ లో యాక్టివ్ కేసులు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అని వరుసగా మూడవ రోజు కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8 లక్షల కంటే తక్కువగా నమోదు అయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం తన లెక్కల్లో చెప్పింది.