కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు..ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఇచ్చిన మాట తప్పకుండా పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్..తాజాగా ఏపీ ప్రభుత్వం మరో సంక్షేమపథకానికి శ్రీకారం చుట్టింది.. వైఎస్సార్ భీమా పథకాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించనున్నారు..
ఈ పథకం కోసం ప్రభుత్వం 510కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు.. కోటీ 41లక్షల మందికి లబ్ధి చేకూరనుందని మంత్రి జయరాం చెప్పారు..అయితే వైఎస్సార్ భీమా పథకంలో లబ్దీ పొందాలంటే వారికి వయసుతో నింబంధలను పెట్టారు..ఈ పథకం ద్వారా 18నుంచి 70 ఏళ్లలోపు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత అంగవైకల్యానికి గురైనా వారికి 5లక్షలు, సాధారణ మరణానికి 30వేలు పరిహారం ఇవ్వనున్నారు.