కరోనా తగ్గుతుందని శానిటైజర్ మింగిన యువతి…!

కృష్ణా జిల్లా విస్సన్నపేటలో ఒక ఘటన ఆశ్చర్యం కలిగించింది. విస్సన్నపేట లో ఆగని దగ్గుతో తట్టుకోలేక కరోనా వచ్చింది అనే అనుమానంతో ఒక యువతీ శానిటైజర్ తాగింది. విస్సన్నపేట మండలం ముతరాశిపాలెం గ్రామానికి చెందిన నాగబోయిన శిరీష (20) విసన్నపేట లో టైలరింగ్ చేస్తూ జీవితం నెట్టుకోస్తుంది. ఆగకుండా దగ్గు రావడం తో మంగళవారం కరోనా భయంతో, శానిటైజర్ ను తాగింది.

దీనితో వెంటనే అధికారులు ఆమెను 108 అంబులెన్స్ లో శిరీష ను నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీష ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఆరోగ్యానికి ఏ విధమైన ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. కరోనా తగ్గుతుందనే తాను శానిటైజర్ తాగా అని ఆమె చెప్పింది.