ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం దారుణ ఘటన జరిగింది. 3 ఏళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలి మృతదేహాన్ని ఆ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని కవి నగర్ పారిశ్రామిక వాడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు చందన్ ని నిందితుడిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు… బాలిక తండ్రితో కలిసి ఇంటి బయట మద్యం సేవించాడు.
ఆడుకోవడానికి బాలికను తీసుకురావడానికి చందన్ ఇంటి లోపలికి వెళ్లి ఆ తర్వాత ఆమెను తీసుకుని పారిపోయాడు. ఘటన గురించి బాలిక తల్లి మాట్లాడుతూ… “అతను నా కుమార్తెతో ఆడుకోవాలని చెప్పాడు, నా భర్తతో కలిసి ఇంటికి వచ్చాడు. బాలిక ను తీసుకుని వెళ్ళిన తర్వాత అతను కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. అప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పింది. తర్వాత బాలిక కుటుంబం ఆ ప్రాంతంలో బాలిక కోసం వెతకగా కనపడలేదు. పోలీసులు గాలించగా మృతదేహం దొరికింది.