మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతోన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాగల 24 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటలలో ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమబెంగాల్, బాంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధముగా కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 km నుండి 5.8 km ఎత్తు మధ్య కొనసాగుతోంది.
దీని ప్రభావంతో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి,రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.