ఐబీపీఎస్‌ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ 2020.. అక్టోబర్‌ 23 నుంచి మళ్లీ దరఖాస్తులకు అవకాశం..

-

నిరుద్యోగులకు శుభవార్త. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్) క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ 2020 ప్రక్రియను మళ్లీ నిర్వహించనున్నామని ఐబీపీఎస్‌ తెలిపింది. ఐబీపీఎస్‌ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ 2020 అక్టోబర్‌ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు ఫాంలను సబ్‌మిట్‌ చేయవచ్చు. వాటిని ఎడిట్‌ లేదా మోడిఫై చేయవచ్చు. అలాగే అప్లికేషన్‌ ఫీజు, ఇంటిమేషన్‌ చార్జిలను కూడా చెల్లించవచ్చు. ఇందుకు గాను నవంబర్‌ 6వ తేదీ వరకు గడువు విధించారు. కాగా ఈ రిక్రూట్‌మెంట్‌లో 2557 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

IBPS Clerk Recruitment 2020 application window will open from october 23

ఇక రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియకు కింద తెలిపిన వారు అర్హులని ఐబీపీఎస్‌ తెలియజేసింది.
– నవంబర్‌ 6వ తేదీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు
– సెప్టెంబర్‌ 2 నుంచి 23వ తేదీ వరకు రిజిస్టర్‌ చేసుకోని వారు.
కేవలం పైన తెలిపిన అర్హత కలిగిన వారు మాత్రమే కొత్తగా రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక అభ్యర్థులు రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తు చేసేందుకు www.ibps.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలను కూడా అదే సైట్‌లో తెలుసుకోవచ్చు. కాగా ఈ రిక్రూట్‌మెంట్‌కు గాను ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌లను డిసెంబర్‌ 2020, జనవరి 2021ల మధ్య నిర్వహించనున్నారు.

ఎస్‌బీఐ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ 2020లో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. లేదా అందుకు సమానమైన భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసే సమయంలో అభ్యర్థులు మార్క్‌ షీట్‌ లేదా డిగ్రీ సర్టిఫికెట్‌లను దగ్గర ఉంచుకోవాలి. అభ్యర్థులు కంప్యూటర్స్‌లో ఏదైనా సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా కంప్యూటర్‌ కోర్సు డిప్లొమా, డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్రాలకు చెందిన అధికారిక భాషను ధారాళంగా మాట్లాడగలగాలి.

ఎస్‌బీఐ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ 2020లో అప్లై చేసేందుకు కింది స్టెప్స్‌ అనుసరించాలి…

– ఐపీబీఎస్‌కు చెందిన వెబ్‌సైట్‌ www.ibps.in ను సందర్శించాలి
– హోం పేజీలో సీఆర్‌పీ క్లర్క్స్‌ అనే లింక్‌ను ఓపెన్‌ చేయాలి
– క్లిక్‌ హియర్‌ టు అప్లై ఆన్‌లైన్‌ ఫర్‌ సీఆర్‌పీ-క్లర్క్స్‌ (సీఆర్‌పీ-క్లర్క్స్‌-ఎక్స్‌) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫాం ఓపెన్‌ చేయాలి.
– క్లిక్‌ హియర్‌ ఫర్‌ న్యూ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవాలి.
– ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ల సహాయంతో సేవ్‌ చేసిన డేటాను రీ ఓపెన్‌ చేసి ఎడిట్‌ చేసుకోవచ్చు.
– సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేసి అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి
– సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి

ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎక్స్‌ఎస్‌ఎం అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లిస్తే చాలు. ఇతరులు రూ.850 చెల్లించాలి.

ఐబీపీఎస్‌ క్లర్క్ రిక్రూట్‌మెంట్‌ 2020లో.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు పాల్గొంటున్నాయి. కనుక ఆయా బ్యాంకుల్లో అభ్యర్థులు ఉద్యోగాలు సాధించవచ్చు. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news