ఇక నుంచి ఇన్ కమింగ్ కాల్స్ కూ డబ్బులు చెల్లించాల్సిందే..!

-

No free incoming calls from now in any network

సాధారణంగా ఇన్ కమింగ్ కాల్స్ కోసం మనం ఎటువంటి డబ్బులు చెల్లించం. కేవలం ఔట్ గోయింగ్ కాల్స్ కోసం మాత్రమే రీచార్జ్ చేసుకుంటాం. అయితే.. జియో దెబ్బ వల్ల మిగితా నెట్ వర్క్స్ కోలుకోలేకపోతున్నాయి. అందుకే దాని దెబ్బకు దిమ్మతిరిగిన మిగితా నెట్ వర్క్స్ కోలుకోవడానికి కొన్ని పరిమితులను విధించక తప్పట్లేదు.

దానిలో భాగంగానే.. ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు లైఫ్ టైమ్ ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ ప్లాన్ ను తీసేశాయి. అంటే సిమ్ తీసుకున్న తర్వాత మీకు లైఫ్ టైమ్ ఫ్రీ ఇన్ కమింగ్ వాలిడిటీ ఉండదు. ఇన్ కమింగ్ వాలిడిటీని పెంచుకోవడం కోసం రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం రూ.35, రూ.65, రూ.95 ల రీచార్జ్ ప్యాక్ లను ఎయిర్ టెల్ ప్రవేశ పెట్టింది. రూ. 35 తో రీచార్జ్ చేయించుకుంటే.. 28 రోజుల వాలిడిటీతో పాటు కొంత టాక్ టైమ్, డేటా కూడా లభిస్తుంది.

ఉదాహరణకు మీ ప్లాన్ వాలిడిటీ ఈరోజుతో లాస్ట్ అనుకుంటే.. మీరు 35 రూపాయలతో రీచార్జ్ చేస్తే.. మీకు కొంత టాక్ టైమ్, డేటా వస్తుంది. దాంతో పాటు మీ ప్లాన్ వాలిడిటీ ఈ రోజు నుంచి మరో 28 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఇన్ కమింగ్ కాల్స్ రావు. ఇక.. ఇటువంటి ప్లాన్ నే వొడాఫోన్ – ఐడియా కూడా తీసుకురానుంది.

Read more RELATED
Recommended to you

Latest news