సంజయ్ దత్ ప్రతీ బ్యాటిల్‌లోనూ థంపింగ్ విక్టరీ అందుకుంటున్నాడు. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ కష్టాలని ఓడిస్తూ, ఇన్‌స్పైరింగ్ పాథ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఎంత పెద్ద ప్రాబ్లమొస్తే, అంత పెద్ద విజయం సాధిస్తున్నాడు. బాబా తుజీ గ్రేట్ హో అనిపించుకుంటున్నాడు.
సంజయ్ దత్ క్యాన్సర్ బ్యాటిల్‌లోనూ బంపర్ హిట్ కొట్టాడు. లంగ్ క్యాన్సర్‌ని జయించి మళ్లీ సినిమలు చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడు సంజు. అయితే ఈ హీరోకి పోరాటాలు కొత్త కాదు. ఫస్ట్ మూవీ “రాకీ’ రిలీజ్‌కి నాలుగురోజుల ముందు సంజయ్ అమ్మ నర్గీస్ దత్ క్యాన్సర్‌తో చనిపోయింది. ఈ బాధలో డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యాడు. అయితే తండ్రి సునీల్ దత్ సహకారంతో ఈ వ్యసనం నుంచి బయటపడ్డాడు సంజు.
అన్నీ సజావుగా సాగుతున్నాయి. “సాజన్, రొమాన్స్’ లాంటి హిట్స్‌తో సంజయ్ దత్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది. 1991లో హీరోయిన్ రిచా శర్మతో పెళ్లయ్యింది. కూతురు త్రిశాల పుట్టింది. ఆల్ హ్యాపీస్ అన్నట్లుగా సాగుతోన్న ఈ ప్రయాణంలో చిన్న కుదుపు. సంజయ్ మొదటి భార్య రిచా 1996లో క్యాన్సర్‌తో చనిపోయింది.భార్య చనిపోయాక సంజయ్ మళ్లీ కెరీర్‌పై కాన్సన్‌ట్రేట్ చేసి “ఖళ్‌నాయక్’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే మరోవైపు నుంచి సమస్య వచ్చిపడింది. ముంబాయి బాంబ్‌బ్లాస్ట్‌లో అరెస్ట్ అయ్యాడు సంజయ్ దత్.
తర్వాత బెయిల్‌పై రిలీజై “దావుద్, వాస్తవ్’ లాంటి హిట్స్ కొట్టాడు సంజు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో లంగ్ క్యాన్సర్ వచ్చింది. స్టేజ్-3 ఆరునెలలే టైమ్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రోగంపైనా విజయం సాధించాడు బాబా.