కేసిఆర్ సర్కార్ పై కేంద్రం ప్రశంసలు.. ఎందుకో తెలుసా.?

-

పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ విషయంలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ పని తీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ పంచాయతీల ఆడిట్ విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇక దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 శాతం గ్రామపంచాయతీల ఆన్లైన్ ఆడిట్ పూర్తి చేయడంపై ప్రశంసలు కురిపించారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ కేఎస్ సేథీ. అంతే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ పూర్తయింది అంటూ తెలిపిన ఆయన.. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ విషయంలో మొదటి దశలోనే ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 25 శాతం ఆన్లైన్ ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసింది అని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరో 25 శాతం ఆన్లైన్ అడిట్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news