బంగారు ఆభరణాలు కొనాలనుకునేవారికి ఒక శుభవార్త. దీపావళి పండుగ సందర్బంగా ఆన్‌లైన్‌లో అతిపెద్ద సేల్ జరగబోతోంది. భారీ డిస్కౌంట్ తో ఆభరణాలు కొనొచ్చు. పండుగ సీజన్‌లో బంగారం కొని లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావాలనుకొనేవారికి దీపావళి సేల్ రానుంది. ఇకమీదట నగల కోసం మీరు ఆ షాపు, ఈ షాపు తిరగాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన నగలను భారీ డిస్కౌంట్ తో కొనొచ్చు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా ఆభరణాలను అమ్ముతున్న ఈ – జోహ్రి ద్వారా ఇది సాధ్యం. ఈ ఏడాదిలో అతి పెద్ద దివాళీ సేల్ రాబోతోంది.
జ్యువెల్ ఉత్సవ్ దివాళీ సేల్ పేరుతో అక్టోబర్ 25న అంటే దసరా రోజున ఈ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ దీపావళి పండుగ వరకు ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన నగలను ఈ – జోహ్రి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లో చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. దేశంలో 130 పట్టణాలు, నగరాల్లోని 300 పైగా స్టోర్లు, 230 పైగా నగల వ్యాపారులు తమ నగలను ఈ ప్లాట్ ఫామ్ లో డిస్‌ప్లే చేస్తారు. కస్టమర్లకు 30,000 పైగా డిజైన్లు అందుబాటులో తీసుకొస్తున్నాయి. కాబట్టి కస్టమర్లు తమకు నచ్చిన నగలను చెక్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు.
జ్యువెల్ ఉత్సవ్ దివాళీ సేల్‌లో కస్టమర్లకు అనేక ఆఫర్స్ ఉంటాయి. ఫ్లాష్ సేల్ లో సిల్వర్ కాయిన్స్ కూడా లభించనున్నాయి. దీనితో పాటు అనేక ప్రొడక్ట్స్ పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. గోల్డ్ బులియన్ మార్కెట్ లో ఉన్న ధరలకే కస్టమర్లు నగలు కొనుగోలు చేసుకోవచ్చు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపించిన సంగతి అందరికి తెలిసిందే. ఇది నగల వ్యాపారాల పైనా ప్రభావం చూపింది. అందుకే ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం నగల వ్యాపారులు గతంలో ఎన్నడూ లేనంతగా డిస్కౌంట్స్ ప్రకటిస్తారని అంచనా. కొన్ని నగలపై మేకింగ్ ఛార్జీలు 100 శాతం వరకు తగ్గించనున్నారు. నగలు ఆన్ లైన్ లో కొంటారు కాబట్టి ఆర్డర్ చేసే ముందు అన్ని విషయాలు ఒకసారి పరిశీలించుకోవాలి. బంగారం ధర ఎంత, ఎన్ని క్యారెట్ల నగలు కొంటున్నారు, స్టోన్స్ తీసేసి బంగారాన్ని తూకం చేస్తున్నారా, మేకింగ్ ఛార్జీలు ఎంత, ఆన్ లైన్ లో కన్నా షాపులో ధర తక్కువ వస్తుంది అన్న విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆర్డర్ చేయడం ఉత్తమం.