ఓటేయండయ్యా అంటూ డ్యాన్స్ చేసిన అభ్యర్థి.. వీడియో

-

 Independent candidate shakes a leg to seek votes on Jabalpur roads

ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఎన్నో కుయుక్తులకు పాల్పడుతుంటారు. ఎన్నో హామీలు ఇస్తుంటారు. అన్నింటినీ అమలు చేస్తామంటారు. కొండమీది కోతిని కూడా తెచ్చిస్తామంటారు. ఓటేసేవరకు ఓటరే దేవుడు కదా మరి.. అందుకే.. ఈ అభ్యర్థి చూడండి.. ఓట్ల కోసం డ్యాన్స్ చేశాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. మధ్య ప్రదేశ్‌లో కూడా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి కదా. జబల్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తివారీ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడట. ఇక.. మనోడు ఓటర్లను ఓట్లడగడానికి వెళ్తే ఎవ్వరూ సరిగ్గా రెస్పాండ్ అవట్లేదట. దీంతో నడి రోడ్డు మీద డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో అంతా వచ్చి అతడి డ్యాన్స్‌ను ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టారు. ఇదే అదునుగా భావించి ప్రజలను ఓట్లడుగుతున్నాడట ఆ అభ్యర్థి. వామ్మో.. ఇటువంటి అభ్యర్థులు కూడా ఉంటారా?

Read more RELATED
Recommended to you

Latest news