దుబ్బాక ఎన్నికల్లో నోట్ల కట్టల కలకలం రేగింది. బీజేపీ అభ్యర్ధి రఘు నందన్ రావుకు చెందిన ఇళ్ళలో పోలీసులు తనిఖీలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. రఘునందన్ రావు ఇంట్లో తనిఖీలు చేపట్టగా అక్కడ 18 లక్షల 64 వేలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ తనిఖీల సమయంలో బీజేపీ నేతలు గలాటా సృష్టించారు.
పోలీసులు తనిఖీలు చస్తున్న ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి స్వాధీనం చేసుకున్న నగదును బలవంతంగా లాక్కెళ్ళారు. డబ్బు కట్టలను చూపిస్తూ వారు పరుగులు పెట్టారు. తోపులాటలో సి ఐ, ఎమ్మార్వోలు కింద పడిపోయారు. గోడ దూకి ఇంట్లోకి వెళ్లిన బీజేపీ కార్యకర్తలు కొందరు ఆ డబ్బు లాక్కుని పరిగెత్తగా అక్కడ ఉన్న బీజేపీ నాయకులు పోలీసులే డబ్బులు తెచ్చారంటున్నారు, కాసేపట్లో రఘునందన్ రావు ఇంటికి బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డిలు కూడా వెళ్లనున్నారు.