ఏపీ వాసుల ప్రశ్న: నేరం మోడీదా చంద్రబాబుదా?

-

ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మోడీ – చంద్రబాబులకు ఏపీ వాసులు వేస్తున్న ప్రశ్న ఇది! పోలవరం పాపం, శాపం.. ప్రధాని మోడీదా లేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదా అని! అందుకు గల కారణాలు, జరిగిన కార్యక్రమాల గురించి ఇప్పుడు చూద్దాం!

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎంతగా నష్టపోయిందనేది అందరికీ తెలిసిన సంగతే! రెండు కళ్ల సిద్ధాంతం పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ కు ఎంత అన్యాయం చేయాలో అంతా చేశారు నాటి పెద్దమనుషులు! అయితే ఈ సమయంలో ఏపీకి దొరికిన చిన్నపాటి ఊరట ఏమైనా ఉందంటే… అది పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడమే!

అవును.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన క్రమంలో వీలైనంత తొందర్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని అంతా భావించారు. అయితే మోడీ దించుకున్న భారమా లేక చంద్రబాబు చేసిన అత్యుత్సాహ ఫలితమా అన్నది తెలియాలనేది ఇప్పుడు ఏపీ వాసుల ప్రశ్న. చేతకాకపోయినప్పుడు, చేవలేనప్పుడు పోలవరాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకోవాలి చంద్రబాబు?

పునరాసంతో సహా మొత్తం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలి, ఈ మేరకు చట్టంలో కూడా ఉంది.. ఈ పరిస్థితుల్లో ఫ్యాకేజీ మై మరిగి చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారా లేక హోదా నుంచి తప్పించుకోవడానికి మోడీ పన్నాగం పన్నారా? సరే వీళ్లు వీళ్లు ఏమైనా చేసుకోనిద్దాం… అసలు పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా, మోదీ-చంద్రబాబు చేసుకున్న “ప్యాకేజీ”ల ఒప్పందం గొప్పదా? ఏపీ వాసుల ప్రశ్నలివి?

Read more RELATED
Recommended to you

Latest news