విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదే మంచి ఎక్సాంపుల్. బాలీవుడ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ టివి హోస్ట్ కరణ్ జోహార్ కాఫి విత్ కరణ్ అంటూ ఓ క్రేజీ షో రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న వారంతా నిజాలు బహిర్గతం చేయాల్సిందే. ఎన్నో హాట్ కామెంట్స్ ఈ షో ద్వారా ప్రముఖులు బయటపెట్టారు. లేటెస్ట్ గా శ్రీదేవి తనయురాలు జాన్వి ఈ షోలో పాల్గొంది.
అన్న అర్జున్ కపూర్ తో పాటుగా జాన్వి ఈ షోకి అటెండ్ అయ్యింది. అయితే ఉదయాన్నే లేవగానే మగాడిగా మారితే అది ఎవరిలా మారాలని అనుకుంటున్నావ్ అని అడిగాడు కరణ్ జోహార్. వెంటనే జాన్వి అందరు ఆశ్చర్యపోయేలా విజయ్ దేవరకొండ అంటూ చెప్పింది. అర్జున్ రెడ్డి సినిమాలో అతని నటన నచ్చింది అందుకే అతనిలా మారిపోతా అంటుంది జాన్వి.
చూస్తుంటే విజయ్ క్రేజ్ బీ టౌన్ లో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ఈ ఒక్క సంఘటన తెలియచేస్తుంది. తన్ ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఉన్నా జాన్వి విజయ్ పేరు చెప్పడం అమ్మడు ఈ రౌడీ హీరో ఫ్యాన్స్ మీద కన్నేసిందని అంటున్నారు. ఈమధ్య విజయ్ తో జాన్వి నటిస్తుందని వార్తలొచ్చాయి. అయితే జాన్వి మాత్రం అలాంటి ఆఫర్లేమి రాలేదని చెప్పుకొచ్చింది.