తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అభ్యర్థి రేవంత రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడులోని ఆర్కేనగర్ తరహాలోనే తెలంగాణలో కొడంగలల్ ఎన్నికను కూడా వాయిదా వేయించడానికి టీఆర్‌ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి బంధువుల ఇళ్లల్లో దాదాపు 17 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది…కాగా ఐటీ అధికారులు మాత్రం 51 లక్షల రూపాయల నగదు దొరికిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కేసులో కీలకంగా మారుతుందని డైరీ వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు.. మీడియా కొడంగల్‌పై డేగకన్ను వేస్తే అసలు నిజాలు బహిర్గతం అవుతాయని స్పష్టం చేశారు. తెరాస అధినేతకు సంబంధించి పోలీసుల అధికారులను తన చుట్టూ తిప్పుతున్నారని తన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ శాశ్వతంగా హంతమెందించేందుకు వ్యూహరచన చేసినట్లు ఆరోపించారు. రెండు మూడు రోజుల్లో కొడంగల్ లో ఏదో ఒక ఆందోళన చేసి ఎన్నికను జరగనివ్వకుండా అపుతారని పేర్కొన్నారు.