సీబీఐ డైరెక్టర్ పదవి నుండి అలోక్ వర్మ తొలగింపు ఢిల్లీ పోలీసు (సవరణ) చట్ట ప్రకారం జరగలేదని వర్మ తరపు న్యాయవాది సుప్రీంకు తెలిపారు. గురువారం ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనను వినిపిస్తూ ఢిల్లీ పోలీసు (సవరణ) చట్ట ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవి నియామకం, తొలగింపు ప్రక్రియలకు ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడాన కమిటీ ముందస్తు ఆమోదముద్ర వుండాలని న్యాయవాది ఫాలీ నారీమన్ సుప్రీంకోర్టుకు తెలియచేశారు.. దీంతో ముఖ్యంగా రెండేళ్ల పదవీ కాలానికి కంటే ముందే తొలగించటానికి ఈ కమిటీ ఆమోదముద్ర అవసరమని ఆయన స్పష్టం చేశారు.
గత నెల 26న తనను సీబీఐ డైరెక్టర్ నుండి తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. గతం నెలలో సీబీఐ లో చెలరేగిన వివాదం దేశ రాజకీల్లో కీలకమైన రాజకీయ చర్చకు దారితీసిన విషయం తెలిసిందే కదా.