దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయింది. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పూర్తి ఫలితం రావచ్చని చెబుతున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు లక్షా 98 వేల 766 కాగా లక్షా 64 వేల 192 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఇక దుబ్బాక శాసనసభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి అయిన రఘునందన్ రావు ఈ ఉదయాన్నె సిద్ధిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్ళిన ఆయన పూజలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం ఆయన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక ఈ ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీ పోరాడాయని చెప్పచ్చు. ఇక్కడ కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.