అధికారపార్టీలో విభేదాలు.. కార్యకర్త దుర్మణం..!

-

కడప జిల్లాలో పార్టీకక్షలు భగ్గుమన్నాయి. అయితే ఈసారి అధికార పార్టీలోని వర్గాల మధ్యవైరం బయటపడింది. కొండాపురం మండలం పి.అనంతపురంలో శుక్రవారం వైకాపా కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. అధికార పార్టీకి చెందిన మరో వర్గంవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు గురుప్రతాప్ రెడ్డి(42) మాజీ మంత్రి వైకాపా నేత రామసుబ్బారెడ్డి వర్గానికి చెందినవాడు. అయితే ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

kotlata
kotlata

గండికోట జలాశయం నిర్మాణంలో భాగంగా కొండాపురం మండలంలోని 21 గ్రామాలను అధికారులు ముంపు జాబితాలోకి చేర్చారు. వీటిల్లో 14 గ్రామాలకు గత ప్రభుత్వ హయాంలో పరిహారం అందజేశారు. ప్రస్తుతం మిగిలిన గ్రామాలకు పరిహారం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పి.అనంతపురంలో పరిహారం పంపిణీకి అధికారులు సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఏడాది క్రితమే గ్రామంలో సర్వే చేపట్టి అర్హుల జాబితాను తయారు చేశారు.

అయితే ఈ జాబితాలో 260 మంది అనర్హుల పేర్లు చేర్చారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం అదనపు ఉపకలెక్టరు రోహిణి ఆధ్వర్యంలో అధికార బృందం గ్రామనికి వచ్చింది. ఈ క్రమంలో అధికారులు గ్రామస్తులును అడిగి వివరాలు తీసుకుంటున్నారు. గురప్రతాప్ రెడ్డి ఫిర్యాదు మేరకే అధికారులు పరిశీలనకు వచ్చారని కొందరు ఘర్షణకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు రాళ్లు, మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ గురుప్రతాప్‌రెడ్డిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దాడిలో మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు రమేష్‌రెడ్డితోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీరామశ్రీనివాస్‌ తెలిపారు. మరణవార్త విన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సాయంత్రం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంభీకులను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news