కళ్యాణ్ రాం 118.. సంథింగ్ స్పెషల్

-

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ డైరక్టర్ గా చేస్తున్న మొదటి ప్రయత్నం 118. ఈ సినిమా టైటిల్ కూడా చాలా క్రేజీగా ఉంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా 118లో 8లో కళ్యాణ్ రాం కనిపిస్తాడు.

మరి ఈ సినిమా టైటిల్ కు కథకు లింక్ ఏంటో తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా కళ్యాణ్ రాం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ సినిమాలో రిలీజైన రెండు మూడు వారాలకు కళ్యాణ్ రాం 118 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లు తన కెమెరాతో ప్రేక్షకులను అలరించిన గుహన్ మొదటిసారి మెగా ఫోన్ పట్టి చేస్తున్న సినిమాగా 118 క్రేజ్ తెచ్చుకుంది.

ఈ సినిమాతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ కూడా కళ్యాణ్ రాం తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రాం కెరియర్ లో ఒక్క హిట్టు పడలేదు. నందమూరి ఫ్యాన్స్ అండదండలు ఉన్నా కళ్యాణ్ రాం కెరియర్ మాత్రం అంత శాటిస్ఫైడ్ గా నడవట్లేదు అన్నది వాస్తవం. మరి రానున్న ఈ 118 సినిమాతో అయినా కళ్యాణ్ రాం తన సత్తా చాటుతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news