ఫేస్ బుక్ తో పరిచయాలు.. మోసపోతున్న బాధితులు..!

-

ఫేస్ బుక్ తో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. వేరే వాళ్ల పేరుతో ఐడీలు క్రియేట్ చేసుకుని.. తెలిసిన వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మెల్లిగా మాటలు కలుపుతారు. ముందు నుంచే పరిచయం ఉండటంతో బాధితులు కూడా మొదట్లో ఈజీగా నమ్మెస్తూ చాట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ అని డబ్బులు అడిగడం చేస్తారు. తీరా తన స్నేహితుడికి డబ్బుల గురించి అడిగినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అప్పుడు అర్థమవుతుంది మోసపోయామని. ఇలాంటి మోసాల బారిన ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు గురవుతున్నారు.

విజయవాడలోని కంకిపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఓ ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తున్నాడు. ఓ రోజు ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ.. ‘‘నీకు డబ్బులు కావాలంటే డైరెక్ట్ గా కాల్ చేసి అడగొచ్చు కదా.. ఎందుకు ఫేస్ బుక్ లో మెసేజ్ చేశావ్’’ అని అడిగాడు. దీంతో వెంకటేశ్వర్లు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అప్పుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘నేను డబ్బులు అడగడం ఏంటీ.. నీకు నేనేప్పుడు మెసేజ్ చేశాను.’’ అని చెప్పాడు. దీంతో తన మిత్రుడు ఫేస్ బుక్ లా మాట్లాడిన సంభాషణను మొత్తం స్ర్కీన్ షాట్ తీసి పంపించాడు. అది గమనించిన వెంకటేశ్వర్లు తన పేరుతో ఎవరో నకిలీ ఖాతా సృష్టించాడని గుర్తించాడు. వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు స్రైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘నకిలీ ఖాతాను క్రియేట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మొదట్లో పోలీసుల ఖాతాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పలుకుబడి, హోదా ఉన్న వారినే టార్గెట్ చేస్తున్నారు. ఫేస్ బుక్ లో భద్రత లేని ఖాతాలను గుర్తించి, అందులో ఉన్న ఫోటోలను డౌన్ లోడ్ చేసుకుని.. నకిలీ ఖాతాను క్రియేట్ చేసుకుంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ.. వారి స్నేహితులతో చాట్ చేస్తూ నమ్మకం కలిగిస్తారు. తీరా అత్యవసరం డబ్బులు పంపమంటూ డిమాండ్ చేస్తారు. విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్ లో 30 రోజుల్లో 25 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.’’ అంటూ సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news