కలెక్షన్ కింగ్.. వెయ్యికిపైగా పాతఫోన్లు ఒకే చోట..!

-

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లదే హవా నడుస్తోంది. 60m కెమెరాలతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. ఇవ్వన్నీ ఇప్పటిమాట.. కానీ ఒకప్పుడు నోకియా, సోనీ ఎరిక్సన్ డబ్యూ 910, మోటోరోలా రేజర్ వీ3, శాంసంగ్ ఎస్720 ఇలా అనేక రకాల బ్రాండ్లుకు చెందిన మోడళ్లు వాడేవాళ్లం. అప్పటి ఫోన్లలో ఇప్పుడునన్నీ ఫీచర్లు ఉండేవి కావు. ఫోన్ వచ్చిందా మాట్లాడామా.. పెట్టేశామా.. మహా అంటే పాటలు వినే ఆప్షన్ ఉండేది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఫోన్లో ఫీచర్లు పెరిగాయి. చిన్నతెర కాస్తా చాటంత అయింది. ఎన్నో ఫీచర్లు.. దీంతో పాతఫోన్లు ఔట్‌డేటెడ్‌ అయ్యాయి.

phones
phones

ఈ తరం వాళ్లకు అసలు ఆ ఫోన్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అసలు ఆ ఫోన్లన్నీ ఏం అయిపోయాయి. ఎక్కడ ఉన్నాయో అనే జాడేలేదు. కానీ, టర్కీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం వినియోగంలో లేని వందలాది మొబైళ్లను సేకరించాడు. ఈ మధ్యే వాట్నినింటి ప్రదర్శించి ఔరా అనింపించాడు. టర్కీకి చెందిన సహబెట్టిన్‌ ఓజ్‌సెలిక్‌ సెల్‌ఫోన్‌ మెకానిక్‌. 20ఏళ్ల కిందటే సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపు పెట్టుకుని, అన్ని రకాల మొబైళ్ల మోడల్స్‌ను సేకరించడం మొదలుపెట్టాడు. ‘‘సెల్‌ఫోన్లపై ఉన్న ఆసక్తితో వాటిని సేకరించడం ప్రారంభించాను. ఏదో ఒక రోజు ఇవన్నీ ఔట్‌డేటెడ్‌ అయిపోతాయని, తయారీ ఆగిపోతుందని తెలుసు. అప్పుడు ఇవి అరుదైనవి, అమూల్యమైనవిగా మిగులుతాయని భావించే సేకరించా.’’ అని ఆయన చెప్పుకొచ్చాడు.

సహబెట్టిన్‌ వద్ద నోకియా, శాంసంగ్‌, మోటొరోలా ఇలా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన అనేక రకాల మొబైళ్లు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇది వరకు 2వేల వరకు ఉండేవట. రెండేళ్ల కిందట అతడి ఇంట్లో దొంగలు పడి దాదాపు 700 ఫోన్లు ఎత్తుకుపోయారు. దీంతో ప్రస్తుతం 1300 మొబైళ్ల దాకా ఉన్నాయి. అన్ని మొబైళ్లు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. అరుదైన ఫోన్లు కూడా అతడి వద్ద ఉండటంతో చాలా మంది తమకు విక్రయించమని అడుగుతున్నారట. ఎంత డబ్బయినా ఇస్తామని చెబుతున్నారట. కానీ, వాటిని విక్రయించేందుకు సహబెట్టిన్‌ ఇష్టపడట్లేదు. ఎంత డబ్బు ఇచ్చినా వాటిని అమ్మేది లేదని తేల్చి చెప్పాడు. ఈ మొబైళ్లను సేకరించడం పట్ల గర్వంగా ఉందని వీటిని ఎప్పటికీ తన వద్దే పెట్టుకుని కండిషన్‌లో ఉండేలా చూసుకుంటానని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news