గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు జనసేన పోటీ చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ లో సుమారు 50డివిజన్లపై జనసేన ఫోకస్ చేసింది. గ్రేటర్ పరిధిలోని 40 నియోజకవర్గాల్లో జనసేనకు 20 వేలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పొత్తులపై క్లారిటీ లేదని తెలంగాణ జనసేన నేతలు వ్యాఖ్యానించారు.
పొత్తులపై పవన్ కళ్యాణ్ దే తుది నిర్ణయని వారు స్పష్టం చేసారు. ప్రస్తుతం అమరావతిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అక్కడ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎల్లుండి హైదరాబాదుకి పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. రెండు రోజుల్లో స్పష్టత రానుంది.