ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రఘునందన్.. వాళ్ళతోనే నా పంచాయతీ !

-

మొన్ననే దుబ్బాక ఎమ్మెల్యే ఎన్నికయిన రఘునందన్ రావు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజా సింగ్, రామ చందర్ రావ్, జితేందర్ రెడ్డి హాజరు అయ్యారు. ఇక రఘునందన్ రావు మీడియా తో మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల ఫలితం ఒక రెఫరెండం గా భావిస్తున్నాను అని అన్నారు. దుబ్బాక గడ్డ మీద పోలీసులను ఎదుర్కొన్నామని ఆయన అన్నారు. ఇక మీదట ఈ గులాబీ డ్రెస్ వేసుకుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

సెర్చ్ నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలో సోదాలు చేస్తారా ? అని ప్రశ్నించిన ఆయన పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు. చట్టం తమ చుట్టం అని ఇల్లీగల్ ఆక్టివిటీ లు పోలీసు అధికారులు చేస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులను ప్రజలు కొడితే గదే 324 కేసు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. నా పంచాయతీ పోలీస్ లతో కాదు పోలీసు కమిషనర్ లకు మాత్రమే అన్నారు. 3 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉంటారని తెలిసి కూడా దుబ్బాక ప్రజలు నాకు ఓటు వేశారని ఆయన అన్నారు. ఇక గ్రేటర్ పరిధిలో కూడా బీజేపీ కి ఓటు వేసి ఆశీర్వ దించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news