నెల్లూరు రౌడీమూక వెనక పొలిటికల్‌ లీడర్ల హస్తం ?

-

నెల్లూరు జిల్లాలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియోలపై ఇప్పుడు కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో రౌడీ మూకలు రెచ్చి పోతున్నాయి. ఎందుకోసం కొడుతున్నారో తెలియకుండా ఓ యువకుడిని చితక బాదిన వీడియో సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ దాడి ఎందుకు జరిగింది ? ఇదంతా బెట్టింగ్‌ మాఫియా పనేనా ? దీని వెనక పొలిటికల్‌ లీడర్ల హస్తం ఉందా? అనే చర్చ జరుగుతోంది.

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడిపై దాడి దృశ్యాలు వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు.రెండు వీడియోలలో రాజశేఖర్ అండ్ బ్యాచ్ దాడికి పాల్పడినట్లు నిర్దారించారు. యుగందర్ అనే యువకుడు‌ రాజశేఖర్ కు చెందిన‌ ఇన్నోవా తీసుకుపోయి డ్యామెజ్ చేయడం, దానికి సంబందించి పరిహారం ఇవ్వక‌పోవడంతో ఘర్షణ జరిగింది. ‌ యుగంధనర్ ని మూడో మైలు రాయి వద్దకు తీసుకుపోయి రాజశేఖర్, కిరణ్, అబ్బు అనే వారు కర్రతో దాడి చేసారని ఇది ఏప్రిల్ లో జరిగిందని పోలీసులు తెలిపారు.

మరో సిసి ఫుటేజ్ వీడియోలో కూడా దాడికి పాల్పడింది రాజశేఖరే అని పోలీసులు తెలిపారు. అయితే ఆదాడి ఎందుకు జరిగిందో చెప్పలేదు. సోషియల్ మీడియాలో వైరల్ కావడంతో… దాడికి గురైన యుగందర్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి విషయమై రాష్ట స్థాయి పోలీసు ఉన్నతాదికారులు సీరియస్ అయినట్లు సమాచారం. గతంలో ఇలాంటి‌ సంఘటనలపై విచారణ చేసి, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

వైరల్ వీడియోల్లో దాడి ఘటన కేసులో పోలీసుల పురోగతి సాధించారు. దాడికి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కారణం కాదని స్పష్టం చేశారు. రెండు ఘటనల్లో ఒకరే నిందితుడు, రెండు వీడియోలు వైరల్ అయ్యాయని వివరించారు. నిందితుడు రాజశేఖర్‌పై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నామన్నారు. ఈ విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనుచరులు కాస్త అత్యత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news