ఏపీలో ఇళ్ళ పట్టాల విషయంలో సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో ఇళ్ళ పట్టాలను పంచాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 25 న ఏపీలో ఇళ్ళ పట్టాలను పంచాలి అని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ళ పట్టాలను వచ్చే నెలలో ప్రజలకు అందించాలని నిర్ణయించారు. వాస్తవానికి మూడు సార్లు ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది.
దసరా రోజు కూడా ఇవ్వాలని భావించినా సరే సాధ్యం కాలేదు. అదే రోజు ఇళ్ళను కూడా నిర్మించడం ప్రారంభించాలి అని జగన్ నిర్ణయం తీసుకున్నారు. డీ ఫాం పట్టా ఇచ్చి ఇళ్ళ పట్టాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. తొలి దశలో 15 లక్షల ఇళ్ళను నిర్మిస్తుంది ఏపీ సర్కార్.