గద్వాలలో గ్యారెంటీగా గెలుస్తాం..కేసీఆర్

-


తెలంగాణలో అధికారంలోకి రాగానే గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెరాస అధినేత కేసీఆర్ తెలిపారు. గద్వాలలో నిర్వహించిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమం సమయంలో ‘నేను చేసిన మొట్టమొదటి సారిగా ఆర్డీఎస్ కాలువ నీళ్ల కోసం ఐదారు రోజులు పాదయాత్ర చేశాను, అప్పట్లో ఈ ప్రాంత ప్రజలను చూస్తే నా కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. ‘‘సమైక్య పాలనలో ఎవరూ పట్టించుకోకపోతే 1974లో ఎవరూ అడగ్గకుండానే బచావత్‌.. జూరాల ప్రాజెక్టును కేటాయించారన్నారు. నాటి ఆంధ్రా పాలకులు ఏనాడు ఈ ప్రాజెక్టుని నింపలేదని పేర్కొన్నారు. ఆర్డీఎస్‌ను నాశనం చేసినా పట్టించుకోలేదు. దీంతో ఉద్యమం ఉదృతం చేసే నాటికి నా ఒత్తిడితోనే జూరాలకు నీళ్లు నింపారని వివరించారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మనమే.. ఇక్కడ గద్వాలలో గ్యారెంటీగా గెలుస్తామని రిపోర్ట్‌ వచ్చింది. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు లేవు. తెలంగాణలో కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ములేకనే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కూడా కరెంట్‌ లేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలు, కల్తీ లేని ఆహారాన్ని అందించడం కోసం అన్ని విధాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news