వద్దన్నా చాటింగ్.. చెల్లిని షూట్ చేసిన అన్న !

-

ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్‌ ప్రాంతంలో వద్దన్నా ఒక వ్యక్తితో చాట్ చేసిందన్న కారణంగా 16 ఏళ్ల బాలికను తన అన్నయ్య కాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం ఈ సంఘటన గురువారం జరిగింది. వెల్‌కమ్‌ లోని జంతా కాలనీలో నివసిస్తున్న బాలికను తుపాకీ గాయంతో జగ్ ప్రవీష్ చంద్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.

బాబర్పూర్ నివాసి అయిన అమీర్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అతను తనకు బావ అవుతాడని ఆమె పేర్కొంది.. ఆమె తన తండ్రి మొబైల్‌లో అమీర్‌తో మాట్లాడేది, కానీ ఆమె అన్నయ్య దానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. “గురువారం ఉదయం, ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. అమీర్‌తో సంబంధాలు పెట్టుకోవద్దని అతను ఆమెను కోరాడు. ఈ సమయంలో, అతను ఒక దేశ వాళీ పిస్టల్‌ తో బాధితురాలి మీద కాల్పులు జరిపాడు” అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news