కేటిఆర్ వెయ్యి ఇస్తే నేను లక్ష ఇస్తా: కిషన్ రెడ్డి సవాల్

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేసారు. రోడ్లపై గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని గతంలో ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది అని ఆయన గుర్తు చేసారు. ఇప్పుడు గుంతల్లేని రోడ్లు చూపిస్తే నేను రూ.లక్ష ఇస్తా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేసారు.

హైదరాబాద్ ఒక మహా సముద్రంలా మారింది అని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అని అన్నారు. కార్లు పడవల్లా మారిపోయాయి అని అన్నారు. 67 వేల కోట్లు ఖర్చు పెట్టిన సర్కార్ రాజభవన్ ముందు నీళ్ళు ఆగకుండా చేసిందా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమైంది? అని నిలదీశారు. రేపటి నుంచి బీజేపీ ప్రచారం మొదలుపెడుతున్నాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news