కరోనాతో 5 రోజుల్లో ముగ్గురుని కోల్పోయిన పోలీస్…!

-

కరోనా వైరస్ కారణంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మరణాల రేటు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో, ఆ నగరంలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లోని కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి ఐదు రోజుల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. కానిస్టేబుల్ ధవాల్ రావల్ తన కుటుంబ సభ్యులను కోల్పోయారని అక్కడి ఉన్నతాధికారులు వెల్లడించారు.

ధావల్ రావల్ తన తల్లిదండ్రులను మరియు ఒక సోదరుడిని కోల్పోయాడు. తల్లిదండ్రులు మరియు సోదరుడు అహ్మదాబాద్ లోని తక్కరనగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత క్రమంగా వారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అతని తల్లిదండ్రులను నగరంలోని సివిల్ ఆసుపత్రిలో చేర్పించగా, రావల్ సోదరుడిని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అతని తల్లి నవంబర్ 14 న కన్నుమూశారు మరియు రెండు రోజుల్లో, అతని తండ్రి కరోనావైరస్ తో చనిపోగా రెండు రోజుల్లో ధావల్ రావల్ సోదరుడు కూడా మరణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news