పబ్ జీ తీసుకురాబోయే మూడు ఫిచర్లు ఇవే..!

-

మన దేశంలో పబ్ జీ పేరు చెబితే చాలు చిన్న పిల్లల నుంచి కుర్రకారు వరకు ఉత్సాహంతో ఊగిపోతారు. అలాంటి గేమ్ భద్రతా కారణాల దృష్ట్యా పబ్జీని భారత ప్రభుత్వం సెప్టెంబరు 2న నిషేధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ గేమ్ యుజర్స్ మళ్లి ఆ యాప్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా గేమింగ్ యాప్ గురుంచి వస్తున్నా వార్తలు వారిలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. పబ్జీ గేమ్ ను “పబ్జీ మొబైల్ ఇండియా” పేరుతో తిరిగి లాంచ్ చేయనున్నారు. రాబోతున్న యాప్ లో కొత్తగా 3 ఫీచర్లు తీసుకొస్తున్నారనే వార్త బయటికి వచ్చింది. దీంతో ఔత్సాహికులకు మరింత ఉత్సాహన్ని ఇచ్చింది. కాకపోతే ఈ ఫీచర్లు భారతీయ పబ్జి గేమర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం.

Faug
Faug

నయా ఫీచర్లు ఇవే.. పబ్జీ మొబైల్ ఇండియా” పేరుతో వస్తున్న యాప్లో పాత్రలు ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండవు. దీని వల్ల పిల్లల భావాలు దెబ్బ తీంటాయానే భయం ఉండదు.
యువ ఆటగాళ్లలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి ఆట సమయంలో పరిమితిని ఉంచే సెట్టింగ్స్ సహా అనుకూలించే కంటెంట్ ను కలిగి ఉంటుంది. గ్లోబల్ లేదా కొరియన్ వెర్షన్ వలె కాకుండా దీనిలో గ్రీన్ హీట్ ఎఫెక్టులు వస్తాయంటా.

ప్ర, పబ్జీ మొబైల్ ఇండియా డిసెంబర్ మొదటి వారంలో అధికారికంగా విడుదల కానుందని సమాచారం. అయితే, పబ్ జీ యొక్క భారత్ వర్షన్ ముందుగా ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో మొబైల్ గేమ్ కు అధికారిక నమోదుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం పబ్జి మొబైల్ ఇండియా ఇప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ అయినట్టే.. దీని యొక్క రిజిస్టర్డ్ కార్యాలయం బెంగళూరులో ఉంది. “పబ్జీ మొబైల్ ఇండియా” యాప్ ను ఐఫోన్ యూజర్లకంటే ముందుగానే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news