ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో పెయింటర్‌గా పనిచేసే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ఢిల్లీలో నివసించే వాడు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్ 12న పని మీద నోయిడాకు వెళ్లిన అతడు ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య స్థానిక పోలీసులకు తన భర్త కనిపించటం లేదని ఫిర్యాదు చేసింది. అతడి అదృశ్యం వెనుక భర్త సన్నిహితులు ఉన్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అతడు చివరిగా మాట్లాడిన కాల్‌లో ఓ బంధువుల అతడితో మాట్లాడినట్లు గుర్తించారు. కానీ ఆ వ్యక్తి వివరాలు మాత్రం తెలియలేదు. దీంతో అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ అక్టోబర్ 15న కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ని ఇవ్వాలని ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోతైన విచారణ చేసిన ఢిల్లీ పోలీసులు హర్యాణాలోని మేవత్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలా 19 నెలల తరువాత అతడి ఆచూకీని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలుసుకున్నారు. ఇలా న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన భార్య విజయం సాధించింది.
పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నించారు. కాని, తాను ఇంటికి రానని భర్త మొండికేశాడు. ఎంతో కొంత సంపాదించుకుంటు ఇక్కడే బతుకుతానని మారం చేశాడు. అసలు సంగేతేంటా అని పోలీసులు ఆరా తీస్తే భార్య తిడుతుందనే అలిగి వెళ్లి పోయిన్నట్లు తెలిపాడు. మద్యం సేవించినప్పుడు తన భార్య తరచుగా తిడుతూ ఉండేదని, ఆ తిట్లు తప్పించేందుకే తాను దూరంగా ఉండటానికే ఇక్కడకు వచ్చానని అతడు పోలీసులకు వివరించారు. చేసేదేమి లేక పోలీసులు అతడితో పాటు భార్యకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారిద్దరిని ఇంటికి పంపారు.