ఇండోనేషియాలోని 14 సంవత్సరాల చల్వా ఇస్మా కమల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎందుకంటే తాను పెంచేది ఏ కుక్క పిల్లో కాదు ఏకంగా గా ఆరు పెద్ద కొండచిలువ లను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంది. అలా పెంచుకుంటున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.
అనకొండ నుంచి చూసి ఆమడ దూరం పరిగెత్తే మన ప్రపంచంలో అనకొండలను తన పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న చల్వా ఇస్మా కమల్. తన ఇంటి పక్కన ఉన్న ప్రజలంతా ఆ కొండచిలువను చూసి చాలా భయపడుతున్నారట. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక మనిషిని తిని అంతా భయంకరంగా ఉన్నాయట. చాలామంది చెప్తుంటారు కొండచిలువ మనుషులను తినే స్వభావం కలదని కానీ అమ్మాయి మాత్రం కొండచిలువను చూస్తే నాకు ఎలాంటి భయం కలగడం లేదని చెబుతోంది.
ఆమె ఆ కొండచిలువ ల తో ఉన్నప్పుడు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఆలోచన కూడా లేదట.
ఆమె రోజూ ఆ కొండచిలువ లకు స్నానం చేయించడం వాటితో ఆడుకోవడం వాటిని కౌగిలించుకొని ఫోటోలు వీడియోలు తీసి టిక్ టాక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల వైరల్ గా మారింది.
చల్వా ఆ కొండచిలువ లను గత నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతుందట. అలా వైరల్ అయిన వీడియో కి వచ్చే కామెంట్స్ లో తన భద్రత గురించి ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు.
కానీ ఆ అమ్మాయి తన పెంపుడు జంతువుల గురించి ఇలా అంది. అవి విషపూరితం కావని అవి స్నేహం చేసుకుంటున్నాయని అని చల్వా చెబుతుంది. ప్రజలలో పాముల గురించి ఒక చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తుంది.
అలా వైరల్ అయిన వీడియో లలో చల్వా మాత్రమే కాకుండా తన తమ్ముడు కూడా కనిపిస్తాడు. అతనికి కూడా ఎలాంటి భయం లేకుండా ఆ పాములతో స్నేహం చేస్తున్నాడు.
గత నెల రోజుల క్రితం నుంచి ఆమె ఈ వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. పోస్ట్ చేసిన నెలరోజుల్లోనే ఆమెకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పింది.