నేను దానికి అర్హుడిని కాదు.. సోను సూద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

ప్రస్తుతం కరోనా వైరస్ కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా మారిపోయాడు బాలీవుడ్ నటుడు సోనూ. వలస కార్మికుల నుంచి మొదలుపెట్టి ఇప్పటికి కూడా ఎంతోమంది నిరుపేదలకు విద్యార్థులకు అండగా నిలబడి సహాయం కావాలన్న వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ ప్రస్తుతం ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్ళినా సోనూసూద్ కి నీరాజనాలు పలుకుతున్నారు జనాలు.

అంతేకాదు కొన్ని చోట్ల ఏకంగా సోనూసూద్ కి గుడి కట్టి పూజించాడు కోవడం ఇంట్లో దేవుళ్ళ ఫోటో మధ్య సోను సూద్ ఫోటో పెట్టి పూజలు నిర్వహించడం లాంటి వి కూడా చేస్తున్నారు అయితే తాజాగా దీనిపై స్పందించిన సోను సూద్ తనకు ఇలాంటి పూజలు చేయ వద్దు అంటూ సున్నితంగా తన అభిమానులకు చెప్పాడు. తాను దేవుడ్ని కాదని అలాంటి పూజా కార్యక్రమాలు చేయించుకోవడానికి అర్హుడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు సోను సూద్.

Read more RELATED
Recommended to you

Latest news