పీ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఓకే చెప్పిన బహ్రెయిన్..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసిన పైజర్ కంపెనీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ ‘ఫైజర్’ కంపెనీ అద్భుత ఫలితాలు సాధిస్తుందట.. వచ్చే వారమే బ్రిటన్‌లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించబోతోందట. ఇప్పుడు ప్రపంచానికి పవర్ ‌ఫుల్ కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్న కంపెనీ కూడా ఇదేనని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు

vaccine
vaccine

అయితే అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ పీ ఫైజర్ వినియోగానికి బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. ఇక అత్యవసర సమయంలో ఈ వ్యాక్సి న్‌ను వాడేందుకు బహ్రెయిన్ జాతీయ ఆరోగ్య శాఖ ఆమెదం తెలియజేసింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో శుక్రవారం కథనాలు వచ్చాయి. పీ ఫైజర్ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పూర్తిగా పరీశీలించి, సమీక్షించిన తరువాతనే ఆమోదం తెలిపినట్లు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికాలోని పీ ఫైజర్ సంస్థతో పాటు జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థ కూడా పాల్గొంది.

ఇక ఇదిలా ఉంటే పీ ఫైజర్ వ్యాక్సిన్‌ ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండ్ కూడా ఆమెదం తెలిపింది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ఆమెందించిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే.. గత నెల చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ వినియోగానికి కూడా బహ్రెయిన్ ఆమెదం తెలిపింది. చైనాకు చెందిన సినోఫార్మ్ తయారు చేసిన ఆ వ్యాక్సిన్‌ను దాదాపు 6000 మందికి అందజేశారని సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news