తెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. హాల్ టికెట్లు విడుదల

-

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షా హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. నేటి నుంచి టెట్ వైబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్లో హాల్ టికెట్లు ఈ https:tstet2024.aptonline.in/tstet  వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు విడతల వారీగా టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

తొలిసారిగా ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో టెట్ పరీక్ష ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేశారు. టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news