తమిళ నటి చిత్ర మరణానికి ముందు ఏం జరిగింది ?

-

తమిళ నటి విజె చిత్ర మరణం సంచలనంగా మారింది. కెరీర్‌ లో దూసుకెళ్తున్న సమయంలో ఆమె చనిపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉరివేసుకున్న స్థితిలో కనిపించిన ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఓ హోటల్లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. 28 సంవత్సరాల వయస్సున్న చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. కొద్దిరోజుల కిందటే విజె చిత్రకు చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త హేమంత్‌ తో నిశ్చితార్థమైంది. ప్రస్తుతం చిత్ర ఆయనతో కలిసి నివసిస్తున్నారు. షూటింగ్‌ లతో తీరిక లేకుండా గడుపుతూ.. వివాహానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోవటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌ లో విజె చిత్ర నటించారు. టీవీ ప్రజెంటర్గా.. టీవీ సీరియళ్లలో విస్తృత అవకాశాలు వస్తున్నాయి. పలు టీవీ ఛానళ్లలో ప్రజెంటర్గా పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమ నిర్వహించే కొన్ని ఈవెంట్లలోనూ వీజే చిత్ర.. యాంకరింగ్ చేశారు. హ్యూజ్ ఫ్యాన్ బేస్డ్ ఉన్న టివీ నటిగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా అభిమానులను ఆలరించే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించారు.

సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌ లో నటించింది. సినిమాల్లో కూడా నటించిన చిత్ర టీవీలో డాన్స్ షోలో అదరగొట్టింది. చిత్రకు ఆమెకు డ్యాన్స్‌ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. మరణానికి ముందు రోజు రాత్రి ఆమె ఓ టీవీ సీరియల్ షూటింగ్లో పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. హోటల్కు తిరిగి వచ్చిన తరువాత ఆమె తన కాబోయే భర్త హేమంత్ కు ఫోన్ చేశారు. తాను గదికి చేరుకున్నానని చెప్పారు. అదే చివరి ఫోన్ కాల్. తెల్లవారు జామున హేమంత్ ఆమెకు ఫోన్ చేశారు. పలుమార్లు కాల్ చేసినప్పటికీ.. లిఫ్ట్ చేయలేదు. దీనితో హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎన్నిసార్లు తలుపుకొట్టినా సమాధానం రాలేదు. దీంతో డూప్లికేట్ తాళం చెవితో తలుపులను తీయగా, ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు.

వీజే చిత్ర మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ ఓ కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు ప్రాథమికంగా వినిపిస్తున్నాయి. ఆర్థిక కారణాలు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలో 28ఏళ్ళ వయసులోనే నటి బలవన్మరణానికి పాల్పడటం కోలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news