ఏలూరు విషయంలో WHO కొత్త అనుమనాలు..

-

ఏలూరు వింత వ్యాధి విషయంలో ఇంకా సందిగ్దత నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కోవిడ్ -19 శానిటైజేషన్ చర్యల కోసం ఉపయోగించిన బ్లీచింగ్ మరియు క్లోరిన్‌ ఈ వ్యాధికి కారణం అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సిఎంతో మాట్లాడుతూ అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నామని వారు తీసుకున్న ఆహారం సహా ఆరోగ్య పరమైన వివరాలు తీసుకుంటున్నామని అన్నారు. సర్వే  త్వరలోనే పూర్తి చేస్తామని వారు పేర్కొన్నారు.

మరో వైపు కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించిన బ్లీచింగ్, క్లోరిన్‌లు కూడా కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఏలూరు చేరుకున్న ఇద్దరు సభ్యుల డబ్ల్యూహెచ్‌ఓ బృందం బాధిత ప్రాంతాలను సర్వే చేసి, ఆహార తీసుకోవడం అలవాట్లు, బాధితుల ఆరోగ్య వివరాలను సేకరించింది. కేంద్ర బృందాలు, ఇద్దరు సభ్యుల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏలూరుకు చేరుకున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వ్యాప్తికి కారణమేమిటో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news