జాగ్రత్త పడిన ఏపీ సర్కార్.. కాల్వల్లో నీటికి పరీక్షలు !

-

ఏలూరు అంతుచిక్కని వ్యాధి నేపథ్యంలో కారణాలు గుర్తించేందుకు తాగునీటిపై అధికారుల ఫోకస్ పెట్టారు. కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి పరీక్షలు చేయిస్తున్నారు అధికారులు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 80 గ్రామాల్లో తాగునీటికి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. రూరల్ వాటర్ సప్ప్లై అధికారుల ఆధ్వర్యంలో తాగునీటికి పరీక్షలు జరుగుతున్నాయి. ఏలూరు సిటీ, రూరల్ లో ఉన్న దెందులూరు, పెదపాడు మండలాల్లో కృష్ణా కాల్వ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. దెందులూరు మండలంలో కొన్ని గ్రామాలకు గోదావరి నీరు సరఫరా అవుతోంది. దీంతో ఆయా నీటి కాలువలో ఉన్న నీటిని పరీక్షించనున్నారు అధికారులు.

ఏలూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. ఏవీఆర్ మోహన్ మాట్లాడుతూ 47 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారని అన్నారు. ఏలూరు నుండి విజయవాడ ఆసుపత్రికి తరలించిన వారు ఇద్దరు మృతి చెందారు కానీ వారు ఇతర కారణాలతో మృతి చెందారని పేర్కొన్నారు. వేరే ఆరోగ్యకారణాలతో మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిని ఎప్పటికప్పుడు గ్రామసచివాలయ సిబ్బంది, డాక్టర్లు పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దన్న ఆయన ప్రజలతో పాటు జంతువుల నుండి  సాంపిల్స్ సేకరిస్తున్నారని ఏలూరు చుట్టుపక్కల గ్రామాలలోను తాగునీటి సాంపిల్స్ సేకరిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news